Breaking News

నేనే హీరోయిన్‌ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు!

Published on Mon, 11/03/2025 - 12:25

సినిమా హీరోహీరోయిన్లకన్నా బిజీగా ఉంటుంది యాంకర్‌ సుమ (Anchor Suma Kanakala). ఎప్పుడూ ఏదో ఒక షో, ఈవెంట్‌, ఇంటర్వ్యూ అంటూ పరిగెడుతూనే ఉంటుంది. రోజులో ఎన్ని ఈవెంట్స్‌ చేసినా సరే కొంచెం కూడా అలిసిపోయినట్లుగా కనిపించదు. రోజంతా హుషారుగానే కనిపిస్తుంది, గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. యాంకరింగే కాకుండా గతంలో సినిమాలు కూడా చేసింది. అప్పుడెప్పుడో చివరగా జయమ్మ పంచాయితీ (2022) మూవీ చేసింది. 

నా చెక్కు కొట్టేసింది
తాజాగా మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన 'ప్రేమంటే..' మూవీలో సుమ కానిస్టేబుల్‌గా యాక్ట్‌ చేసింది. ఈ సినిమా టీజర్‌ ఈవెంట్‌లో సుమ మాట్లాడుతూ.. ఈరోజు చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ ప్రోగ్రాం మనమే స్టార్ట్‌ చేస్తుంటాం. అలాంటిది ఈ రోజు యాంకర్‌ గీత ఈ ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేసి మన చెక్కు కొట్టేసింది. నన్ను ఈ సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్‌ అని చెప్పారు. 

ఇంత మోసం చేస్తారా?
అయితే దర్శి కంటే నా వయసు మరీ తక్కువ కావడంతో డైరెక్టర్‌ నవనీత్‌ వద్దన్నారు. ఆ తర్వాత పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్‌ చేశాక అది పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌ కాదు, పవర్‌లెస్‌ కానిస్టేబుల్‌ అని తెలిసింది. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికింకా పెళ్లి కాలేదని వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకోటి ఏముంటుంది? 

నేనే గ్లామర్‌గా కనిపించా..
ఆనంది.. నా రోల్‌ కొట్టేశావ్‌.. అయినా ఇట్స్‌ ఓకే! పర్వాలేదు, బాగా చేశావు. గ్లామర్‌ విషయానికి వస్తే నీకంటే నేనే ఎక్కువ గ్లామర్‌గా కనిపించానని చెప్తున్నారు. ఈ సినిమాలో నాక్కూడా ఓ పాట ఉంది. అందులో ఒక హుక్‌స్టెప్‌ ఉంది. పాట రిలీజయ్యాక మీరందరూ ఆ హుక్‌స్టెప్‌ చేయాలి అంటూ సరదా స్పీచ్‌ ఇచ్చింది. ప్రియదర్శి-ఆనంది కాంబినేషన్‌లో వస్తున్న ప్రేమంటే సినిమాతో​ నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్‌ 21న విడుదల కాబోతోంది.

చదవండి: ఏడ్చేసిన సుమన్‌.. నామినేషన్స్‌లో ఎవరంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)