Breaking News

యాంకర్‌ రష్మీతో రాజమౌళి లవ్‌!.. ఇదెప్పుడు జరిగింది?

Published on Wed, 02/19/2025 - 11:06

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ (Anchor Rashmi Gautam), దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ప్రేమలో పడ్డారు. రష్మీ అయితే ఓ అడుగు ముందుకేసి తనతో కలిసి డ్యుయెట్‌ కూడా పాడేసింది. కాకపోతే అది కలలో! ఇదంతా రీల్‌ లైఫ్‌లో జరిగింది. వీరిద్దరి ప్రేమకహానీకి సంబంధించిన సన్నివేశం క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మీ గౌతమ్‌ యాంకర్‌ అవడానికి ముందు సీరియల్స్‌ చేసింది. యువ సీరియల్‌ (Yuva Serial)లో ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ధారావాహికలో రాజమౌళి కూడా అతిథి పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట వదిలారు.

రాజమౌళితో డ్యుయెట్‌
అందులో ఏముందంటే.. రష్మీ తన స్నేహితురాలితో కలిసి ఓ కెఫెలో కూర్చుంది. ఇంతలో రాజమౌళి అక్కడకు వస్తాడు. అది చూసిన రష్మీ ఫ్రెండ్‌.. ఇన్నిరోజులు నీకు ఫోన్‌ చేస్తోంది రాజమౌళియా? అని అడుగుతుంది. అటు రష్మీ మాత్రం తనతో ఇన్నాళ్లూ కబుర్లాడింది రాజమౌళి అని తెలిసేసరికి గాల్లో తేలుతుంది. జింతాత జితా జితా పాటకు తనతో కలిసి స్టెప్పులేస్తున్నట్లు కలగంటుంది. వెంటనే తేరుకుని తన ఫ్రెండ్‌ను అక్కడినుంచి పంపించేస్తుంది.

(చదవండి: సింపుల్‌గా ఈ టిప్స్‌ పాటించి బరువు తగ్గాను: హన్సిక)

అంకుల్‌ అయ్యుంటే..
ఇంతలో జక్కన్న.. రష్మీ దగ్గరకు వస్తాడు. ఆమె సంతోషంతో.. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. ఇన్నిరోజులు నాతో మాట్లాడుతుంది మీరా? అని అడుగుతుంది. అందుకు జక్కన్న రోజులు కాదు గంటలు.. అరగంటకోసారైనా మాట్లాడాలిగా అని డైలాగ్‌ వదులుతాడు. నేను అంకుల్‌ అయ్యుంటే ఏం చేసేవాడివని ప్రశ్నించగా పర్లేదు, నేను ఆంటీనయ్యేదాన్ని అని రష్మీ రిప్లై ఇచ్చింది. త్వరగా వెళ్లిపోవాలని రాజమౌళి అంటే అప్పుడే వెళ్లాలా అని అతడి చేయి నిమురుతుంది. 

రాజమౌళికి ప్రపోజ్‌ చేసిన రష్మీ
ఏంటో చెప్పమని ఆరా తీస్తే రష్మి కనురెప్పలు టపాటపా కొడుతుంది. అది అర్థం చేసుకోలేని రాజమౌళి కళ్లు మండుతున్నాయా? అని అడుగుతాడు. దీంతో హీరోయిన్‌ కోపంతో ఊగిపోతూ షటప్‌.. దానర్థం ఐ లవ్యూ... నీక్కూడా తెలీదా? అని అరిచేస్తుంది. ఇది చూసిన జనాలు ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కళాకారుడే.. రష్మిది చిన్న వయసు కాదన్నమాట.. ఇదెక్కడి కాంబినేషన్‌రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కింగ్‌ నాగార్జున.. 2007లో యువ సీరియల్‌ నిర్మించారు. ఇందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది.

 

చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్‌ సిరీస్‌.. వెలుగులోకి భారీ స్కామ్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)