Breaking News

డబ్బుతో బుద్ధిని కొనలేం.. ఎమోషనలైన యాంకర్​ రష్మీ

Published on Wed, 02/02/2022 - 13:12

Anchor Rashmi Gautam Emotional On Bengalore Dog And Car Incident: బుల్లితెర యాంకర్​గా సూపర్​గా రాణిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది రష్మీ గౌతమ్​. తరచుగా సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే రష్మీకి మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఢిల్లీలోని జూ నిర్వాహకులపై మండిపడిన విషయం తెలిసిందే. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న వీధి కుక్కకు చికిత్స చేయించింది. అనంతరం ఇంటికి తీసుకెళ్లి దానికి చుట్కీ అని పేరు పెట్టి మరీ పెంచుకుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు రష్మీకి మూగజీవాలంటే ఎంత ప్రేమో. అలాగే వాటిని హింసించే వారిపై అంతే ఆగ్రహం చూపిస్తుంది. తాజాగా ఓ ఘటనపై మండిపడింది రష్మీ.

బెంగళూరులోని ఒక అపార్ట్​మెంట్​లోని ఒక యువకుడు తన కారును నడుపుతూ పడుకున్న కుక్కపై నుంచి తీసుకెళ్లాడు. దీంతో ఆ కుక్క మరణించినట్లు సమాచారం. అయితే ఆ కారు నడిపిన యువకుడి ఫ్యామిలీకి వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నా పోలీసులు అరెస్టు చేశారట. ఈ ఘటనపై రష్మీ సోషల్​ మీడియా వేదికగా స్పందించింది. 'డబ్బుతో వస్తువులు కొనొచ్చు గానీ బుద్దిని, పద్ధతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ మూగజీవి పడ్డ బాధను ఆ కుటుంబమంతా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కలను రాళ్లతో కొట్టడం పిల్లలకు నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఇలా తయారవుతారు.' అని భావోద్వేగానికి లోనైంది రష్మీ. 

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)