అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్

Published on Sun, 06/23/2024 - 19:10

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి తెలుగులో స్టార్‌ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వేకేషన్‌ ట్రిప్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.

అయితే తాజాగా ఓ టీవీ షో మెరిశారు అనసూయ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్‌ ఏంటి నాన్‌సెన్స్‌ అనసూయ? ఏదైనా అంటే విక్టిమ్(బాధితురాలిగా) కార్డ్‌ ప్లే చేస్తారు? అంటూ కామెంట్ చేశాడు. ‍అయితే దీనికి అనసూయ రియాక్ట్ అయింది. అసలు మీ అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అలాగే మీ ఎమోజీ, మీ మైండ్‌ విషయంలో అంటూ అతనికి ఇచ్చిపడేసింది. కాగా.. టీవీ షో అనసూయతో పాటు కొరియోగ్రాఫర్‌ షర్ట్‌ విప్పుతూ కనిపించారు. దీనిపై నెటిజన్‌ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్పందించింది.

ఆ వీడియోపై మరో నెటిజన్ రాస్తూ..'నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి. ఎలా ఉండే షో ఎలా అవుతుందో.. అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి. కానీ బ్యాడ్‌ వైపు వెళ్తుంది. ఒక నటిగా మీరంటే ఇష్టమే..ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో అలాంటివి చేయకుంటే మీకే మంచిది' అని కామెంట్‌ చేశాడు. దీనిపై కూడా అనసూయ స్పందించింది. 

అనసూయ రిప్లై ఇస్తూ..'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పరిస్థితులు, మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ‍అయినా మీ ప్రతాపం అంతా చిన్నతెరపై కాదు.. పెద్ దతెరపై ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు వాటిని బ్లాక్‌బస్టర్‌ చేస్తారు.. అంతే కాదు షో మొత్తం చూడకుండానే జడ్డిమెంట్‌ ఇస్తారు. ఇది కేవలం ప్రోమో. స్టోరీ ముందు, వెనుక చాలా ఉంటుంది. అక్కడ అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి లిమిట్స్‌కే పరిమితం. కొందరికి ప్యాంట్, షర్ట్‌ కూడా చాలా ఇబ్బందే. నేను చెప్పింది మీకు అర్థం అయిందనుకుంటా' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)