Breaking News

అలాంటి పాత్రలు చేయడమంటే ఇష్టం.. ఛాంపియన్ బ్యూటీ..!

Published on Sun, 04/19/2026 - 09:06

ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందుకు ఫర్‌ఫెర్ట్ ఎగ్జాంపుల్ అనస్పర రాజన్‌. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తెలుగు, తమిళం, హిందీ అంటూ పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మాతృభాష మలయాళంలో  ఉదహరణం సుజాత అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ  9 ఏళ్లలోనే  30కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇటీవల తమిళంలో హీరోయిన్‌గా నటించిన విత్‌లవ్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో కళాశాల విద్యార్థినిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఇట్లు అర్జున, తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 7 జీ రెయిన్‌బో కాలని చిత్రాలతో పాటు మలయాళంలో ఓ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రత్యేక ఫొటో షూట్‌ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అనస్పర రాజన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఛాలెంజింగ్‌ కథా పాత్రల్లో నటించడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఎలా ఇలాంటి పాత్రల్లో నటించారు అని చర్చించుకునే విధంగా బలమైన పాత్రల్లో  నటించాలని ఆశిస్తున్నానన్నారు. తనకు ఛాలెంజ్‌లను ఎదుర్కొవడం ఇష్టం అన్నారు. అలాంటి వైవిద్యభరిత కథా పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు ఇప్పటి వరకూ నటనకు అవకాశం  ఉన్న పాత్రలనే ఎక్కువగా చేశారు. ఈ 23 ఏళ్ల బ్యూటీ ముందు ముందు ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే. 
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)