Breaking News

హార్ట్‌ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్‌.. బాధగా ఉందన్న సమంత!

Published on Wed, 04/02/2025 - 17:06

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలకు దిగడం..వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతొ ఈ వివాదం ఇంకాస్త పెద్దదైంది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదంతా పక్కకి పెడితే ప్రకృతి ప్రేమికులు మాత్రం 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.

(చదవండి: 'రేపోమాపో నేను చనిపోతాను.. తల్లిగా అడుక్కుంటున్నా..', 'మూగజీవాల్ని ఏం చేస్తారు?')

సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రేణు దేశాయ్‌, ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, యాంకర్‌ రష్మి తదితరులు ఈ వివాదంపై స్పందిస్తూ.. చెట్లను, జంతువులను కాపాడుకోవాలని కోరారు. ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్‌ సమంత,  యాంకర్‌, నటి అనసూయ సైతం ఈ వివాదంపై స్పందించారు. 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 400 ఎక‌రాల క‌థ‌నంపై ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక తెలంగాణ టుడేలో వ‌చ్చిన ఆర్టిక‌ల్‌ని పోస్ట్ చేసిన స‌మంత..బులడోజర్స్ తో 400ఎకరాల్లో చెట్లను నరకటం చాలా బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయని.. అడవుల్ని నరుక్కుంటూ పోతే.. ఇప్పటికే ఉన్న దానికంటే.. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ జంతువులు, పక్షులను కాపాడండి అని నినాదం ఇచ్చింది.

ఇక సోషల్‌ మీడియా సంచలనం అనసూయ సైతం ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని రాత్రి పూట వీడియోలు, జింకలు, ఇతర మూగజీవాలు సేద తీరుతున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ..ఇది నిజంగా హార్ట్‌ బ్రేకింగ్‌ అంటూ రాసుకొచ్చింది. 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు