Breaking News

బరాత్‌లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!

Published on Sat, 07/13/2024 - 12:35

అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్‌ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ సైతం విచ్చేసి అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్‌లో సినిమా స్టార్స్‌ డ్యాన్స్‌తో హోరెత్తించారు.

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్‌ జోనస్‌ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్‌ను వెనక్కు నెట్టిందో హీరోయిన్‌. లైగర్‌ బ్యూటీ అనన్య పాండే నిక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ‍ప్రియాంకతో డ్యాన్స్‌ చేసింది. దీంతో నిక్‌ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్‌వీర్‌ సింగ్‌.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ చూశారా?, బరాత్‌ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్‌ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్‌, రాశీ ఖన్నా, రణ్‌వీర్‌ సింగ్‌, అనిల్‌ కపూర్‌.. ఇలా తారలంందరూ బరాత్‌లో సరదాగా చిందేశారు.

 

 

 

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)