Breaking News

25 ఏళ్లకే కొత్త ఇల్లు కొన్న హీరోయిన్‌.. గృహప్రవేశం ఫోటోలు వైరల్‌

Published on Sat, 11/11/2023 - 09:24

అనన్య పాండే.. బాలీవుడ్‌లో క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. లైగర్‌ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ ఈ సినిమా బెడిసికొట్టడంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటోంది. అయితే 25 ఏళ్లకే బాగా సంపాదించిన అనన్య పాండే తాజాగా ముంబైలో కొత్త అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసింది. ధంతేరస్‌ నాడు నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ 'ఇదే నా కొత్త ఇల్లు' అంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

గుమ్మం ముందు కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే లోనికి అడుగుపెట్టింది. ఈ వీడియోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది చూసిన సెలబ్రిటీలు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత త్వరగా ఇల్లు కొనేశావా? వావ్‌.. ఈ ఇల్లు నీకు సంతోషంతోపాటు అదృష్టాన్ని కూడా అందించాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు అనన్య తల్లి భావన ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.. చాలా గర్వంగా ఉంది అని కామెంట్‌ చేసింది. 

కాగా అనన్య పాండే చివరగా డ్రీమ్‌ గర్ల్‌ 2 సినిమాలో నటించింది. ఇది 2019లో వచ్చిన డ్రీమ్‌ గర్ల్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ రెండో భాగంలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించగా రాజ్‌ శాండిల్య దర్శకత్వం వహించాడు. ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో కో గయే హమ్‌ కహాన్‌, కంట్రోల్‌ సినిమాలున్నాయి.

చదవండి: అవసరం లేకున్నా ఆ సీన్ చేయమన్నారు: హీరోయిన్‌

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)