Breaking News

చికెన్‌ లెగ్స్‌.. అగ్గిపుల్ల అని బాడీ షేమింగ్‌ చేశారు : హీరోయిన్‌

Published on Sat, 05/17/2025 - 14:03

సినిమా తారలు కూడా మనషులే. వాళ్లకి మనసు ఉంటుంది. వాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్‌ చేస్తే ఆ మనసు బాధపడుతుంది. కానీ కొంతమంది మాత్రం ఇవేవి పట్టించుకోకుండా.. హీరోయిన్లపై ఇష్ట వచ్చినట్లుగా కామెంట్‌ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ల శరీర సౌష్ఠవంపై  రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇవన్ని తట్టుకొని నిలబడితేనే మనం మన కెరీర్‌లో విజయం సాధిస్తాం అని చెబుతోంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday). 

2019లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా వెండితెర ఏంట్రీ ఇచ్చిన ఈ భామ..తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్‌ఎల్  చిత్రాలలో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. అయితే తన కెరీర్‌ తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లలానే తాను కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యాయని చెబుతోంది అనన్య.

తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా శరీరంపై కామెంట్స్‌ చేశారు. కోడీ కాళ్లు.. అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా బాడీపై విమర్శలు చేసేవారు. నీ శరీరం సరైన ఆకారంలో లేదనే కామెంట్స్‌ కూడా చేశారు. ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే.. ‘ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. మనం(మహిళలు) ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధిస్తాం’అని అనన్య చెప్పుకొచ్చింది. 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)