Breaking News

లైగర్ హీరోయిన్‌ సోదరికి ప్రెగ్నెన్సీ.. వీడియో వైరల్!

Published on Wed, 02/28/2024 - 16:03

లైగర్ భామ అనన్య పాండే గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉంది.  

కాగా.. గతేడాది అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 2023లో తన ప్రియుడు ఐవోర్ మెక్ క్రేను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. తాజాగా అలన్నా పాండే గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనన్య తల్లి భావన పాండే సైతం శుభాకాంక్షలు తెలిపింది. 

అలన్నా, ఐవర్ వివాహం

అనన్య పాండే తండ్రి చుంకీ పాండే సోదరుడు చిక్కి పాండే కుమార్తె అయిన అలన్నా.. తన ప్రియుడు ఐవోర్ మెక్‌క్రేని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో సహా పలువురు బీ టౌన్‌ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కాగా.. ఐవోర్ ఒక అమెరికన్ దర్శకుడు, ఫోటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. కాగా.. గతంలో వీరిద్దరు మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)