Breaking News

ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్

Published on Fri, 07/31/2026 - 18:45

'గుండె నిండా గుడి గంటలు' అనే తెలుగు సీరియల్‌తో ప్రతిరోజు ప్రేక్షకుల్ని పలకరించే మీనా అలియాస్ అమూల్య గౌడ.. ఎట్టకేలకు శుభవార్త చెప్పేసింది. తన ప్రియుడి ఎవరో బయటపెట్టింది. తాజాగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఈమె అతడితో కలిసి ముచ్చట్లు చెబుతూ అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. పుకార్లని నిజం చేస్తూ సహనటుడితోనే ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకోవడంపై నటి సురేఖావాణి క్లారిటీ)

మైసూరుకి చెందిన అమూల్య గౌడ.. పదకొండేళ్ల క్రితం సొంత భాష కన్నడలో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. స్వాతిముత్తు సీరియల్‌లో తొలుత నటించింది. తర్వాత నటించిన 'కమలి' సీరియల్ ఈమెకు బోలెడంత గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం పునర్ వివాహ, ఆరామనే తదితర ధారావాహికల్లో కనిపించింది.

'కార్తీకదీపం' మోడ్రన్ వెర్షన్‌లో పెద్ద శౌర్యగా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మెప్పించి 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో మీనా పాత్రలో అలరిస్తోంది. అయితే ఈమె కన్నడలో 'కమలి' సీరియల్ చేస్తున్నప్పుడే సహ నటుడు నిరంజన్‌తో ప్రేమలో పడింది. గతంలోనే వీళ్లిద్దరి బంధం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వాటపై అటు అమూల్య గానీ ఇటు నిరంజన్ గానీ స్పందించలేదు.

ఇప్పుడు ఎట్టకేలకు అమూల్యనే తన యూట్యూబ్ వీడియోతో నిరంజన్ తన ప్రియుడు అని క్లారిటీ ఇచ్చేసింది. ఇతడు కూడా కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగులో ఎన్నెన్నో జన్మలబంధం, సత్యభామ సీరియల్స్‌లో హీరోగా చేశాడు. మరి ఇప్పుడు తన బంధాన్ని బయటపెట్టేశారు కాబట్టి త్వరలోనే పెళ్లి కబురు కూడా చెప్పేస్తారేమో చూడాలి?

(ఇదీ చదవండి: బన్నీ, మహేశ్‌కి పోటీ.. చరణ్-ఎన్టీఆర్ కూడా బిజినెస్‌లోకి?)

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)