బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Breaking News
అమితాబ్.. ఈసారి భయపడలేదు
Published on Mon, 11/09/2026 - 08:47
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఎప్పటికప్పుడు తన ఇంటి దగ్గరకు వచ్చే అభిమానుల్ని కలుస్తూ ఉంటారు. అయితే వారం క్రితం బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ రక్షణతో రావడంతో అదికాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితమే హిందీ హీరో టైగర్ ష్రాఫ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అమితాబ్ అప్రమత్తమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం అమితాబ్ భయపడలేదు.
(ఇదీ చదవండి: రజినీకాంత్ జైలర్ 2.. ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)
దీపావళి రోజున ముంబైలోని తన నివాసం జల్సా బయటకు వచ్చి మరీ అమితాబ్ అభిమానులకు అభివాదం చేశారు. గత ఆదివారం మాదిరిగా బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ రక్షణ లేకుండానే ఆయన అభిమానుల ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా వెంట నిలిచాడు. బిగ్ బీ, అభిమానులను కలిసేందుకు బయటకు వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసులు జుహూలోని ఆయన నివాసం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచారు.
ఇకపోతే రీసెంట్ టైంలో అమితాబ్ భద్రత, ఆరోగ్య పరిస్థితిపై పలు ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జల్సా వద్ద భద్రతకు ముప్పు పొంచి ఉందని ముంబై పోలీసులకు ఈ వారంలోనే ఓ బెదిరింపు ఈ-మెయిల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కుమారుడితో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్)
Tags : 1