Breaking News

ఒసామా బిన్‌లాడెన్‌పై వెబ్‌ సిరీస్‌.. ఎలా ఉందంటే?

Published on Sat, 06/28/2025 - 02:05

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో అమెరికన్‌ మేన్‌ హంట్‌: ఒసామా బిన్‌ లాడెన్‌ వెబ్‌ సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌  గురించి తెలుసుకుందాం.

9/11... అమెరికా చరిత్రలో ఇదో మరచిపోని సంఖ్య. నాటికి, నేటికి, రేపటి తరానికి గుర్తుండిపోయే దారుణ ఘటన ఈ 9/11. న్యూయార్క్‌ నగరంలోని రెండు పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3000కి పైగాప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అతి కిరాతక చర్యగా అమెరికా చరిత్రలో నిలిచిపోయింది. అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడి  9/11కి సూత్రధారి బిన్‌ లాడెన్‌. అంతటి కరుడు గట్టిన తీవ్రవాదిని ఉత్కంఠభరితంగా మట్టుబెట్టాయి నిఘా సంస్థలు. ఇదే ఇతివృత్తంగా నాటి ఘటనలను సిరీస్‌ రూపంలో నేడు నెట్‌ ఫ్లిక్స్‌ మన ముందుకు తీసుకొచ్చింది.

‘అమెరికన్‌ మేన్‌ హంట్‌: ఒసామా బిన్‌ లాడెన్‌’ పేరుతో ఈ సిరీస్‌ మూడు భాగాలతో నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగు భాషతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషలలో ఈ సిరీస్‌ని విడుదల చేశారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ... సిరీస్‌ మొత్తం అప్పుడు జరిగిన కొన్ని వాస్తవ సన్నివేశాలతో రూపకల్పన చేయడం. అంతేకాదు... అమెరికాలో ఈ ఆపరేషన్‌ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి ప్రెసిడెంట్‌కి బ్రీఫ్‌ చేయడం, అలాగే అప్పటి ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్‌ను కూడా చాలా చక్కగా ఎడిట్‌ చేసి, చూపించారు.

నిజానికి ఈ సిరీస్‌ చూడడం మొదలు పెట్టిన కొద్ది సమయానికే మనం కూడా ఈ ఆపరేషన్‌లో వర్చ్యువల్‌గా ఇన్వాల్వ్‌ అయిపోతాం. మనకు 9/11 ఘటన గురించి తెలిసింది పిడికిడెంత అయితే ఈ సిరీస్‌ ద్వారా కొండంత విషయాలు తెలుస్తాయి. ‘అమెరికన్‌ మేన్‌ హంట్‌: ఒసామా బిన్‌ లాడెన్‌’...  వర్త్‌ఫుల్‌ వాచ్‌. – హరికృష్ణ ఇంటూరు  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)