Breaking News

వెస్ట్రన్‌ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా

Published on Wed, 03/05/2025 - 18:28

అమీషా పటేల్‌ (Ameesha Patel).. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బద్రి, నాని, నరసింహుడు, పరమవీరచక్ర చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న ఆమె గదర్‌ 2తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది తాబ తెర జల్వ సినిమాలో మెప్పించింది. తాజాగా ఆమె బాలీవుడ్‌ హీరో కమ్‌ విలన్‌ సంజయ్‌దత్‌ (Sanjay Dutt)తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది. 

ఆయన ఇంట్లో కురచ దుస్తులు నిషిద్ధం
అమీషా పటేల్‌ మాట్లాడుతూ.. సంజయ్‌ ఇంటికి నేను సల్వార్‌, చుడీదార్‌ వేసుకునే వెళ్లాలి. పొట్టి బట్టలు, వెస్ట్రన్‌ దుస్తులు వేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. నాపై ఎంతో అభిమానం కురిపించేవాడు. నువ్వు చాలా అమాయకురాలివి, ఈ సినీపరిశ్రమలో ఎలా ఉంటావో.. ఏంటో.. అని పదేపదే అంటుండేవాడు. అంతేకాదు నాకోసం మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తానన్నాడు, కన్యాదానం కూడా అతడే చేస్తానని చెప్పాడు.

నేనంటే వల్లమాలిన ప్రేమ
ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. చాలాసార్లు సంజు ఇంట్లోనే నా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అమీషాకు ఇప్పుడు 49 ఏళ్లుకాగా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. సంజయ్‌ దత్‌-అమీషా పటేల్‌.. తథాస్తు, చతుర్‌ సింగ్‌ టు స్టార్‌ సినిమాల్లో కలిసి నటించారు. సంజయ్‌ దత్‌ విషయానికి వస్తే.. ఆయన చివరగా డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ద భూతిని అనే హారర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది

 

 

చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్‌.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)