Breaking News

'30 ఏళ్లు గ్యాప్‌ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్

Published on Fri, 04/04/2025 - 19:38

సల్మాన్ ఖాన్ ఇటీవలే సికందర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఊహించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు సల్లు భాయ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొన్నారు. అదే సమయంలో రష్మికతో సల్మాన్‌ ఏజ్ ‍గ్యాప్‌పై పలువురు ప్రశ్నించారు. మీ కూతురి వయస్సున్న అమ్మాయితో ఎలా నటిస్తారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. దీనిపై సల్మాన్ సైతం స్పందించారు. ఆమెకు లేని ఇబ్బంది.. మీకు ఎందుకని ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. భవిష్యత్తులో రష్మికకు పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ ఖాన్ అన్నారు.

తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా స్పందించారు. సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ ‍అనేది సాధారణ విషయమన్నారు.  ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీషా పటేల్ మాట్లాడారు. అలాగే తనకు కూడా గదర్‌ చిత్రంలో సన్నీ డియోల్‌కు, నాకు దాదాపు 20 ఏళ్ల అంతరం ఉందని ఆమె గుర్తు చేశారు.

అమీషా మాట్లాడుతూ..' గదర్‌-2 సినిమాలో నాకు సన్నీ డియోల్‌కు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అందుకే మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని అభిమానులు ఇష్టపడుతున్నారు. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో కలిసి పనిచేశానని' తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)