Breaking News

షూటింగ్‌లో కనీసం ఫుడ్‌ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!

Published on Fri, 06/30/2023 - 19:56

తెలుగులో చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో స్టార్ హీరోలందరితో టాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. పంజాబీలో మూవీస్‌లోనూ నటిస్తోంది. తాజాగా గదర్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. 

(ఇది చదవండి: దిల్‌ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి )

అయితే ఇటీవలే గదర్‌-2 మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న భామ చిత్ర యూనిట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మే నెల చివర్లో జరిగిన గదర్-2 షూటింగ్‌లో నిర్మాణ సంస్థ తీరు పట్ల అమీషా పటేల్ వరుస ట్వీట్లు చేసింది.  అనిల్ శర్మ ప్రొడక్షన్స్‌ తమకు ఆహారం, వసతి, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. తాము పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్‌ వారు ఆహారం, వసతి, రవాణా కోసం బిల్లులు చెల్లించేదని అమీషా పటేల్ ఆరోపించింది |

అమీషా ట్వీట్‌లో రాస్తూ..' మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి సరైన వేతన బకాయిలు చెల్లించలేదు. షూటింగ్ చివరి రోజున చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు, ఆహార బిల్లులకు కూడా డబ్బులు చెల్లించలేదు. నటీనటులు, సిబ్బందికి కార్లు కూడా సమకూర్చలేదు. అక్కడే ఒంటరిగా వదిలిలేశారు. కానీ వెంటనే జీ స్టూడియోస్ వారు రంగంలోకి దిగి అన్ని బకాయిలు చెల్లించారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పులను వారు సరిదిద్దారు. గదర్ 2 అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోందని అందరికీ తెలుసు. ఈ సమస్యను పరిష్కరించిన షరీక్ పటేల్, నీరజ్ జోషి, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. జీ స్టూడియోస్ టీమ్ ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సన్నీ డియోల్‌ సరసన గదర్ 2లో అమీషా పటేల్ నటించింది.

(ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)