Breaking News

ఓటీటీలో రూ. 300 కోట్ల సినిమా .. అధికారిక ప్రకటన

Published on Sat, 11/30/2024 - 11:55

సూపర్‌ హిట్‌ సినిమా అమరన్‌ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన  ఈ సినిమా థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఈ హిట్‌ మూవీ నెట్‌ప్లిక్స్‌ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రా​న్ని  కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం  ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్‌ వచ్చేసింది.

భారీ అంచనాల మధ్య విడుదలై అమరన్‌ మూవీ డిసెంబర్‌ 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. తమిల్‌తో పాటు తెలుగు,మలయాళం, కన్నడ,హిందీ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. అమరన్‌ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్‌ చేరింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా  తెరకెక్కించారు. 

కథేంటంటే...
ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఇది. ఇందులో ముకుంద్‌ వరదరాజన్‌గా శివకార్తికేయన్‌ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్‌ పాత్రను సాయి పల్లవి పోషించారు.  2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్‌ వరదరాజన్‌ ఇండియన్‌ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి?  44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్‌ బాబా, అసిఫ్‌ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)