Breaking News

రెండో పెళ్లి తర్వాత రీఎంట్రీ.. ఫోటోలు షేర్‌ చేసిన బ్యూటీ

Published on Thu, 11/13/2025 - 07:01

అమలాపాల్‌(Amala Paul).. ఆ పేరే ఒక సంచలనం అని చెప్పవచ్పు. వివాదాలకు కేరాఫ్‌ అనే చెప్పాలి. ఆదిలోనే చర్చనీయాంశమైన కథా పాత్రల్లో నటించిన అమలాపాల్‌.. 'మైనా' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత  ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరించడంతో స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. అలా విక్రమ్‌ హీరోగా నటించిన దైవతిరుమగళ్ (నాన్న)..  విజయ్‌కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా తమిళ్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, నాయక్‌ వంటి చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

అయితే,  కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు విజయ్‌తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బందం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత చిత్రాల్లో నటించడం మొదలెట్టిన అమలాపాల్‌ నిర్మాతగానూ అవతారమెత్తి మలయాళంలో ఒక చిత్రం చేశారు. ఆ తరువాత జగత్‌ దేశాయ్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరికి ఇళయ్‌ అనే మగబిడ్డ ఉన్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. 

అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ.., కేరళ  చికిత్స సాయంతో తన అందాలకు మెరుగు పెడుతున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా నటించడానికి కథలను వింటున్నట్లు తెలిసింది. దీంతో అమలాపాల్‌ సెకెండ్‌ ఇన్నింగ్‌ ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. కాగా సమాచారంతో ఆమె అభిమానులను ఖుషీ అవుతున్నారు.  

Videos

Gadwal District: బస్సు టైర్లపై అధిక ఒత్తిడి పడటంతో లీకైన గాలి

Red Fort: ఢిల్లీ పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు

అంబటి రాంబాబుపై దౌర్జన్యం చేసిన సీఐ వెంకటేశ్వర్లు

గెలుపు మాదే..! 20 వేల మెజారిటీ పక్కా..!!

Kakani: ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క YSRCP నేతకు ధన్యవాదాలు

Praja Udyamam: పెనుకొండలో ఉష శ్రీ చరణ్ బైక్ ర్యాలీ

దేవుడి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ధూళిపాళ్ల అనుచరుడు

ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

ఢిల్లీ పేలుడు.. ఉమర్‌ డైరీలో షాకింగ్‌ విషయాలు

Vijayawada: ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ఈ ప్రజా ఉద్యమంతో కళ్ళు తెరవండి

Photos

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)