Breaking News

అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్‌ హీరోయిన్‌

Published on Wed, 08/30/2023 - 07:42

నటి అమలాపాల్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మంచి, సంచలన, వివాదాస్పద నటి అంటూ ముద్రవేసుకున్న నటి ఈమె. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్‌ ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. విజయ్‌, ధనుష్‌ వంటి ప్రముఖ నటులు సరసన నటించిన అమలాపాల్‌ టాలీవుడ్‌లోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. నటిగా మంచి పీక్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్​.. ఆదిలింగం ఎవరంటే)

అయితే రెండేళ్లలోపే మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి విడాకులకు దారి తీసింది. కాగా అమలాపాల్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అందులో మైనా చిత్రం తరువాత తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని పేర్కొంది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలన్నారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఆవేదన చెందానని చెప్పింది.

(ఇదీ చదవండి: విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్‌)

తనను చూసి తన కంటే ఎక్కువ తన తల్లి బాధపడిందని చెప్పింది. తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరంది. ఒక వేళ అలాంటి వ్యక్తి ఎవరైనా వుండి వుంటే తానూ అందరిలా ఆనందంగా ఉండేదానినేమోనని పేర్కొంది. కాగా ఆ మధ్య నిర్మాతగా మారిన అమలాపాల్‌ ప్రస్తుతం మాతృభాషలో మూడు చిత్రాలు, తమిళంలో ధనుష్‌ 50వ చిత్రంలో నటిస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)