Breaking News

రెండోపెళ్లి చేసుకోబోతున్న స్టార్‌ హీరోయిన్‌.. బర్త్‌ డే రోజే సర్‌ప్రైజ్!

Published on Thu, 10/26/2023 - 14:57

స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి సైతం పరిచయం ‍  అక్కర్లేని పేరు. రామ్ చరణ్ మూవీ నాయక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ..  అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మెప్పించింది. ఈ ఏడాది అజయ్ దేవగణ్ నటించిన భోళా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇవాళ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేరళ కుట్టి  రెండోసారి పెళ్లికి సిద్ధమైంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముద్దుగుమ్మ. 

(ఇది చదవండి: Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!)

ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.  అమలాపాల్, జగత్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది.  తన లవర్‌ అమలాపాల్‌కు జగత్ దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు.  ఆ తర్వాత కాబోయే దంపతులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నా జిప్సీ క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. గతంలో డైరెక్టర్‌ ఏఎల్ ‍ విజయ్‌ను పెళ్లాడిన అమలాపాల్.. 2017లో విడాకులు తీసుకుంది. 

కాగా.. అమలాపాల్  2009లో మలయాళ చిత్రం నీలతామరా మూవీలో తొలిసారిగా నటించింది. 2010లో తమిళ చిత్రం మైనాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది. బాలీవుడ్‌, తమిళంతో పాటు తెలుగు, మలయాళం,  కన్నడ చిత్రాల్లోనూ నటించింది. .

(ఇది చదవండి: మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్‌ హీరో: నాగార్జున)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)