Breaking News

నా కోడళ్లు బంగారం.. డిమాండ్‌ చేసే అత్తను కాను: అమల

Published on Sat, 10/18/2025 - 10:29

'నా కోడళ్లు బంగారం అంటోంది' హీరో అక్కినేని నాగార్జున భార్య, నటి అమల అక్కినేని (Amala Akkineni). మంచి కోడళ్లు దొరికినందుకు సంతోషంగా ఉన్నానని చెప్తోంది. ఈ మేరకు ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ, జైనబ్‌ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అమల మాట్లాడుతూ.. నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా మారింది. వారి వల్లే నాకు గర్ల్స్‌ సర్కిల్‌ ఏర్పడింది. 

బిజీగా ఉండటం మంచిదే!
కోడళ్లిద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఈ కాలం అమ్మాయిలు బిజీగా ఉండటం మంచిదే! వాళ్ల పనుల్లో వారు బిజీగా ఉంటే నా పనులతో నేను బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటాం. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని డిమాండ్‌ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్‌ చేసే భార్యను కూడా కాదు.. ఒక సాధారణ తల్లిని మాత్రమే! అని అమల చెప్పుకొచ్చింది.

అక్కినేని కుటుంబం
నాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య సంతానం. 1990వ సంవత్సరంలో దంపతులు విడిపోయారు. అనంతరం 1992లో నాగ్‌.. నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్‌ సంతానం. నాగచైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. 2024లో హీరోయిన్‌ శోభిత ధూళిపాళను పెళ్లాడాడు. అఖిల్‌.. జైనబ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్‌ భయం!

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)