Breaking News

అల్లు శిరీష్‌ 'బడ్డీ'.. అల్లు అర్జున్‌పై ఆసక్తికర కామెంట్స్!

Published on Wed, 07/31/2024 - 15:46

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌ ప్రస్తుతం బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రంలో  గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. అడ్వెంచర్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రూపొందించిన ఈ మూవీకి శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ అభిమానులు అంచనాలు మరింత పెంచేశాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.  

తాజాగా బడ్డీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మీడియా ప్రతినిధులకు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. చిన్నప్పటి నుంచి మీ బెస్ట్ బడ్డీ ఎవరు? అని శిరీష్‌ను అడిగారు.

దీనిపై అల్లు శిరీష్‌ స్పందిస్తూ..' నా బెస్ట్ బడ్డీ మా అన్నయ్య.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం.. మా డాడీ సినిమాలు చూస్తూ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండేవారు.. రెండు వారాలకొకసారి డాడీ వచ్చేవారు.  నేను, అన్నయ్య 9 ఏళ్లపాటు ఓకే రూమ్‌లో ఉండేవాళ్లం.  నాన్నతో కూడా షేర్ చేయలేని విషయాలను అన్నయ్యతోనే షేర్ చేసుకుంటా. విషయం ఏదైనా ముందు అతనికే ముందు చెబుతా. ' అని అన్నారు. కాగా.. బడ్డీ సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతతో చర్చించి టికెట్‌ రేట్లు తగ్గించామని తెలిపారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)