ఏంటీ బ్రో అల్లు అర్జున్ వస్తున్నారా?.. నిజమా.. నిఖిల్ షాక్..!

Published on Fri, 12/16/2022 - 21:21

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్‌'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్‌ డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. 

అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ భారీస్థాయిలో చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈనెల 19న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నట్లు ఈ వీడియోలో హీరో నిఖిల్‌కు అభినవ్ చెప్పడం సరదాగా అనిపిస్తోంది.

బన్నీ హాజరువుతున్నారని అభినవ్ చెప్పడంతో అఖిల్ సైతం అశ్చర్యానికి గురి కావడంలో అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియో అభినవ్, అఖిల్ సరదా సంభాషణ వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు విభిన్న రీతిలో చూపించారు.

సరదా సంభాషణ సాగిందిలా..

అభినవ్:బ్రో నిఖిల్, కార్తికేయ మీరు ఇక్కడ ఎంటీ? 

నిఖిల్: జోర్డాన్‌కి షూటింగ్‌ కోసం వచ్చా

అభినవ్: నువ్వు షూటింగ్‌ ఏంది భయ్యా? మీది ఏదో సినిమా రిలీజ్ ఉంది కదా. 

నిఖిల్: ఏదో కాదు 18 పేజెస్. 

అభినవ్:18 పేజెస్ నాకు తెలుసు తగ్గేదేలే.

నిఖిల్: అది పుష్ప సినిమా డైలాగ్. 18 పేజెస్ సినిమా డైలాగ్ కాదు.

అభినవ్: మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు ‍అర్జున్ వస్తున్నారు

నిఖిల్: ఏంటీ? మళ్లీ వస్తున్నారా? అల్లు అర్జున్ వస్తున్నారా? ఐ లవ్ యూ బ్రో

అభినవ్: ఐ లవ్‌ యూ టూ బ్రో

నిఖిల్: మరీ వెళ్దాం పదా..!

అభినవ్: మీ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందా? స్క్రిప్ట్ మొత్తం ఇచ్చారా?

నిఖిల్: హా బాగా వచ్చింది. 18 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చారు. అంటూ ఇద్దరు అక్కడి వెళ్లిపోయారు. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)