Breaking News

నాకు అవార్డు రావడానికి కారణం ఆయనే: బన్నీ ట్వీట్ వైరల్

Published on Tue, 10/17/2023 - 19:55

జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయనకు జాతీయ అవార్డు రావడం పట్ల ట్వీట్ చేశారు. నా ఈ విజయానికి కారణం ఆయనేనంటూ పోస్ట్ చేశారు.

బన్నీ తన ట్వీట్‌లో రాస్తూ..'జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. నాకు గుర్తింపు ఇచ్చిన  జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. మన సినిమాను ఆదరించిన వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా సుకుమార్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా విజయానికి కారణం ఆయనే.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఎర్రచందనం నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)