Breaking News

తోడుగా, నీడగా.. ఐకాన్‌ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్‌

Published on Tue, 04/08/2025 - 14:22

విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్‌ అనిపించుకున్నాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్‌ ఇండియాను కాకుండా పాన్‌ వరల్డ్‌ బాక్సాఫీస్‌కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

గడిచిన ఏడాది కష్టంగా..
సాదాసీదా హీరో నుంచి ఐకాన్‌ స్టార్‌ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్‌తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.

43వ బర్త్‌డే
అతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్‌కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: పాపకు, నాకు డీఎన్‌ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)