Breaking News

నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే

Published on Sun, 06/21/2026 - 16:04

ఫాదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమకు తోచిన రీతిలో తండ్రి గురించి పోస్టులు పెడుతున్నారు. నాన్నని గుర్తుచేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?)

అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్‌ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'నా తండ్రే నా దైవం. కంటికి కనిపించే, మాట్లాడే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో సర్వస్వం ఆయనే ఇచ్చారు' అని రాసుకొచ్చాడు. తండ్రితో దిగిన ఫొటోలకు ప్రవచనకర్త చాగంటి వాయిస్ ఓవర్ జోడించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ప్రపంచంలోని తండ్రులందరికీ అల్లు అర్జున్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాడు.

'పుష్ప' సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్నాడు. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)