Breaking News

శోభిత- నాగచైతన్య పెళ్లి.. సతీసమేతంగా హాజరు కానున్న ఐకాన్ స్టార్!

Published on Tue, 12/03/2024 - 16:03

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇప్పటికే అంతా సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. దీంతో ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు టాలీవుడ్‌ ప్రముఖులు ఎవరెవరు హాజరవుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుటుంబసమేతంగా హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కూడా చై వివాహా వేడుకలో సందడి చేయనున్నారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు, సన్నిహితులు కూడా హాజరయ్యే అవకాశముంది. ఈనెల 4న అంటే బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వీరి పెళ్లి వేడుక జరగనుంది.

కాగా.. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలవ్వగా శోభిత హల్దీ వేడుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మంగళస్నాన వేడుకను సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్‌స్టాలో షేర్ చేశారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)