Breaking News

'పుష్ప' సినిమాకు మూడో పార్ట్? వర్కౌట్ అయ్యే పనేనా?

Published on Wed, 02/07/2024 - 09:10

అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇప్పుడు చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతా బాగుందనకునేలోపు ఏకంగా మూడో పార్ట్ కూడా ఉందని తెగ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఉంటే ప్లస్సులు మైనస్సులు ఏంటి?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, వాటికి సీక్వెల్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి హీరో కూడా తమ తమ సినిమాలకు సీక్వెల్స్‌ని రెడీ చేస్తున్నారు. 'పుష్ప'కి కూడా సీక్వెల్ ఉంటుందని తొలి భాగం రిలీజైనప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మూడో భాగమని అంటున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌ని 2021లో డిసెంబరులో థియేటర్లలోకి తీసుకురాగా.. సీక్వెల్ మాత్రం 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. అంటే ఒక్క సినిమా తీయడానికి దాదాపు మూడేళ్లు పట్టేసింది. ఇక సీక్వెల్ అంటే మరో రెండు మూడేళ్లయినా పట్టేయొచ్చు.

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో?)

అలానే అల్లు అర్జున్‌, సుకుమార్‌కి 'పుష్ప 2' కాకుండా వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి. బన్నీ కోసం త్రివిక్రమ్, అట్లీ లాంటి డైరెక్టర్స్ లైనులో ఉన్నారు. అలానే సుక్కూ కోసం చరణ్, మహేశ్ తదితరులు ఆల్రెడీ వెయిటింగ్‌లో ఉన్నారని టాక్. అలానే ప్రేక్షకులకు ఓ పార్ట్ నచ్చింది కదా అని వరసపెట్టి అవే తీసుకుంటూ పోతే కంటెంట్ ఎంత బాగున్నా సరే జనాలకు బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది.

ముందుగా 'పుష్ప' కథని వెబ్ సిరీస్ గా తీయాలనేది డైరెక్టర్ సుకుమార్ ప్లాన్. కానీ సినిమాగా వచ్చింది. రికార్డులు సృష్టించింది. అయితే తొలి భాగం హిట్ అనేది ఎవరూ ఊహించలేదు. కానీ రెండో భాగంపై అంచనాలైతే ఉన్నాయి కానీ ఏం జరుగుతుందనేది చూడాలి. ఒకవేళ రెండో పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే మూడో పార్ట్ రావొచ్చు. లేదంటే మాత్రం సైలెంట్ అయిపోవచ్చేమో. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి మరి.

(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)