Breaking News

Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా

Published on Tue, 01/07/2025 - 00:16

పుష్పరాజ్‌ (‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌పాత్ర పేరు) అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్‌’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో నటించారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.

అయితే డిసెంబరు 4 నుంచి ప్రీమియర్స్‌ మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో ‘పుష్ప 2: ది రూల్‌’ విడుదలైంది. సినిమా రిలీజైన 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు గ్రాస్‌ వసూలు చేసి, రూ.1810 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి–2’ సినిమా వసూళ్లను ‘పుష్ప 2’ అధిగమించి, సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. ఆమీర్‌ఖాన్‌ నటించిన హిందీ సినిమా ‘దంగల్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రూ.1831 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్‌’ నిలిచింది. కాగా బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్‌’ మొదటి స్థానంలో నిలిచింది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)