Breaking News

పుష్ప-2 మూవీ.. విడుదలకు ముందు బిగ్‌ షాక్!

Published on Tue, 12/03/2024 - 18:44

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే పుష్ప-2 ప్రభంజనం థియేటర్లలో మొదలు కానుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెనిఫిట్ షోలు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.

అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని 3డీ వర్షన్‌లో అందుబాటులోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్‌లోనూ కేవలం 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే 3డీ వర్షన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే.. ఆ షోలు కూడా 2డీ వర్షన్‌లోనే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్‌ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇది చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)

కాగా.. సుకుమార్‌- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్‌, డాల్బీ, డిబాక్స్‌, 4డీఎక్స్‌, ఐస్‌, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్. 
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు