Breaking News

నేడు అల్లు అర్జున్‌ కేసు తుది తీర్పు.. తిరుమలలో సతీమణి స్నేహారెడ్డి

Published on Wed, 11/06/2024 - 09:17

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసుకు సంబంధించి నేడు ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో   తనపై నంద్యాలలో నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.  అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిష‌న్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది. అయితే నవంబరు 6న తుది తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం ప్ర‌క‌టించడంతో ఆయన ఆభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తిరుమలో అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి
బుధవారం తెల్లవారుజామున బన్నీ సతీమణి స్నేహరెడ్డి తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో   స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేదాశీర్వచనం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఆమెతో పాటుగా అల్లు అర్జున్‌ లేరని తెలుస్తోంది. మరో నెలరోజుల్లో పుష్ప విడుదల కానున్నండంతో ఆయన సినిమా షెడ్యూల్‌ విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)