Breaking News

జపాన్‌కి పుష్పరాజ్‌ 

Published on Thu, 12/04/2025 - 03:13

పాన్‌ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన పుష్పరాజ్‌ జపాన్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హీరో అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌ (పుష్పరాజ్‌)లో నటించిన ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమా 2026 జనవరి 16న జపాన్‌లో విడుదల కానుంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా, శ్రీలీల ప్రత్యేక పాటలో సందడి చేశారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

అంతేకాదు... విడుదలైన 32 రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1831 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై (డిసెంబరు 4న ప్రీమియర్స్‌) నేటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని విమల్‌ థియేటర్‌లో స్పెషల్‌ షో ఏర్పాటు చేశారు నిర్మాతలు. మరి.. వచ్చే ఏడాది జపాన్‌ భాషలో రిలీజ్‌ కానున్న ‘పుష్ప 2: ది రూల్‌’ ఎన్ని వసూళ్లు సాధిస్తుంది? ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)