Breaking News

అల్లు అర్జున్‌తో సమంత వన్స్‌మోర్‌!

Published on Sat, 04/12/2025 - 00:00

అల్లు అర్జున్, సమంత మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై జంటగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్, సమంత తొలిసారిగా జోడీ కట్టారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా...’లో అల్లు అర్జున్, సమంత కలిసి కొన్ని డ్యాన్స్‌ స్టెప్పులేశారు. తాజాగా ఈ జోడీ మరోసారి రిపీట్‌ కానుందట.

అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు మెయిన్‌ హీరోయిన్స్, మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో నటించనున్నారట. 

ఈ మెయిన్‌ హీరోయిన్స్‌లోని ఒక రోల్‌ కోసం సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. మరి... అల్లు అర్జున్, సమంతల జోడీ మరోసారి స్క్రీన్‌పై రిపీట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘తేరీ’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్‌’ (అదిరింది) చిత్రాల్లో సమంత ఓ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)