Breaking News

రాకా మూవీ.. అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

Published on Fri, 04/10/2026 - 17:07

అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్‌లో ఉన్న అల్లు అర్జున్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది.  ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్‌ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్‌కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్‌కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్  ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Videos

అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!

బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

కారుపై పడ్డ కాంక్రీట్ లారీ

విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!

మొయినాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

మద్యం తాగి పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరులు

కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ..

Photos

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)