Breaking News

శివం భజే హీరోయిన్‌కు ఊరట.. అసలేం జరిగిందంటే?

Published on Sun, 08/04/2024 - 20:20

ఇటీవల శివం భజే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ దిగంగనా సూర్యవన్షి. అశ్విన్‌ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ. ఆగస్టు 1న థియేటర్లో రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మహేశ్వర్‌ రెడ్డి నిర్మించారు. అయితే ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ సింగర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా దిగంగనా సూర్యవన్షికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెపై నమోదైన ఓ కేసును కోర్టు కొట్టివేసింది. గతంలో ఆమెపై దర్శక-నిర్మాత అయిన మనీష్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై నిర్మాత చేసిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా దిగంగనా ముంబయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

అసలేం జరిగిందంటే..

ఈ ఏడాది జూన్‌లో ఎంహెచ్‌ ఫిల్మ్స్, మనీష్ ప్రొడక్షన్ హౌస్ మేకర్స్‌ దిగంగనా మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షో స్టాపర్ వెబ్ సిరీస్‌కు వ్యాఖ్యాతలుగా నటుడు అక్షయ్ కుమార్‌ను తీసుకొస్తానని తమ వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పిందని మనీష్ హరిశంకర్ ఆరోపించారు. అంతేకాకుండా  హరిశంకర్‌ను బెదిరించిం డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని ఆమెపై ఆరోపణలు చేశారు. 
 

అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ దిగంగన సూర్యవంశీ.. నిర్మాత మనీశ్ హరిశంకర్‌కు పరువు నష్టం నోటీసులు పంపారు. అతను తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు వివరించింది. కాగా.. షో స్టాపర్ అనే వెబ్ సిరీస్‌లో జీనత్ అమన్, జరీనా వహాబ్, శ్వేతా తివారీ, సౌరభ్ రాజ్ జైన్ లాంటి బాలీవుడ్ తారలు నటించారు. అయితే ఈ సిరీస్‌  వివాదంలో చిక్కుకుంది. చాలామంది నటీనటులతో పాటు, సిబ్బందికి పారితోషికం చెల్లించలేదని  నిర్మాతపై ఫిర్యాదు చేశారు.
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)