Breaking News

‘మిస్సయిన 1.5 లక్షలమంది ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు’

Published on Sat, 04/22/2023 - 07:22

నాంది వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందించిన మరో చిత్రం ఉగ్రం. ఈ చిత్రంలో మీర్నామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఖమ్మంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. 

ట్రైలర్‌ చూస్తే యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. మిస్సింగ్‌ కేసులను పరిష్కరించే పోలీసు పాత్రలో అల్లరి నరేశ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌ ఫుల్‌ యాక్షన్‌ సీన్స్‌తో అలరించనున్నారు. ట్రైలర్‌ చివర్లో 'ఒక మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం.. అదే మనిషి కనిపించకుండా పోతే మనం పోయేంత వరకు గుర్తు చేసుకుంటూ బాధపడతాం.'  డైలాగ్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్‌కి, దేవరి అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సిద్‌.. శ్రీ చరణ్‌ పాకాల సంగీతమందించారు. 

(ఇది చదవండి: రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!)

ఈవెంట్‌లో అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ.. 'ఇది నా కెరీర్‌లో 60వ సినిమా. మహర్షిలో నేను పోషించిన పాత్ర నచ్చడంతో అలాంటి రోల్‌లో ఓ సినిమా చేద్దామన్నారు దర్శకుడు విజయ్‌. అలానే నాందిని తెరకెక్కించాం. మంచి విజయం సాధించింది. మళ్లీ ఉగ్రం సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రం నాందికి మించి ఉంటుంది. మిస్సింగ్ కేసుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా తీస్తున్నప్పుడు లాక్‌డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసింది. వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు.' అంటూ ఎమోషనలయ్యారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)