Breaking News

ఉగ్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Wed, 05/31/2023 - 16:14

అల్లరి నరేశ్‌ పోలీసాఫీసర్‌గా చేసిన కత్తి కాంతారావు, బ్లేడ్‌ బాబ్జీ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ మూడోసారి లాఠీ పట్టి చేసిన ఉగ్రం మాత్రం మిశ్రమ స్పందన అందుకుంది. నాంది తర్వాత విజయ్‌ కనకమేడల- నరేశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఉగ్రం. మిర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. హరీశ్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. మనకు సమస్య వస్తే పోలీస్‌ దగ్గరకు వెళ్తాం.. అదే పోలీస్‌కు సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా పరిష్కరిస్తాడు? అనేదే కథ.

అల్లరి నరేశ్‌ కెరీర్‌లో 60వ చిత్రంగా తెరకెక్కిన ఉగ్రం మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీలో రాబోతోంది. జూన్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

ఇకపోతే అల్లరి నరేశ్‌ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లాతో ఓ మూవీ, సుబ్బు దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. అలాగే విజయ్‌ కనకమేడల డైరెక్షన్‌లోనూ మరోసారి నటించే ఆస్కారం ఉంది.

చదవండి: మూడోసారి సహజీవనం.. 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)