Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
మా మూవీలో విలన్ ఎవరో ఊహించలేరు: అల్లరి నరేశ్
Published on Wed, 11/12/2025 - 13:19
‘‘నేనిప్పటివరకు చాలా జానర్స్ చేశాను. కానీ ‘12ఏ రైల్వే కాలనీ’(12 A Railway Colony)లాంటి థ్రిల్లర్స్ చేయలేదు. ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల జర్క్ అవుతారు. మా మూవీలో విలన్ ఎవరు? అని ఊహించలేరు’’ అని ‘అల్లరి’ నరేశ్(Allari Naresh) చెప్పారు. ‘పొలిమేర, ΄పొలిమేర 2’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్‌గా వ్యవహరించారు.
నాని కాసరగడ్డ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నటించారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘నవంబర్ 21 తర్వాత నాని అనే నా పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నాను’’ అని చెప్పారు.
‘‘ఈ సినిమా తర్వాత నన్ను ఆరాధన అని పిలుస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కామాక్షి. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసేవారికి మా సినిమా ఓ మంచి ట్రీట్’’ అని అనిల్ విశ్వనాథ్ చెప్పారు.
Tags : 1