Breaking News

పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ ఇండియా ప్రాబ్లం మూవీ!

Published on Fri, 02/16/2024 - 20:44

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేశ్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. గతేడాది ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం లాంటి మాస్ సినిమాలతో అలరించిన నరేశ్‌.. మళ్లీ ట్రాక్ మార్చేశాడు. ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన కామెడీ ఓరియంటెడ్‌ చిత్రంతో అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిలక ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకు మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాకు ఆ ఒక్కటీ అడక్కు అనే టైటిల్‌ ఖరారు చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దోడా బయట వాళ్లందరికీ ఏం చెబుతావురా అనే డైలాగ్‌లో గ్లింప్స్‌ మొదలైంది. అందరూ నీ పెళ్లి ఎప్పుడని అల్లరి నరేశ్‌ను అడగడం చూస్తే.. ఆ కాన్సెప్ట్‌తోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ  కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. 

కాగా.. గతంలో 'ఆ ఒక్కటీ అడక్కు’… ‍అనే టైటిల్‌తో రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమా వ‌చ్చింది. అప్పట్లో ఆ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. 1992లో ఈవీవీ సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ సెటైరికల్‌ కామెడీగా మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు అదే టైటిల్‌తో అల్లరి నరేశ్ రాబోతున్నారు.  

Videos

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

గుంటూరు గోపి లాకప్ డెత్..? రాఖీ పండుగ రోజు తీసుకెళ్లి కొట్టి చంపారు..

జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్

ఆ రిపోర్ట్ తో TDP నేతలకు టెన్షన్

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)