Breaking News

బచ్చలమల్లి హిట్‌ అవుతుంది: నాని

Published on Sun, 12/15/2024 - 03:32

‘‘బచ్చలమల్లి’ ట్రైలర్‌ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్‌ అదిరిపోయాయి. నరేష్‌ హిట్‌ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది. ఏ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌ అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని నాని అన్నారు. ‘అల్లరి’ నరేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించిచన ఈ పీరియాడికల్‌ యాక్షన్  డ్రామా ఫిల్మ్‌ ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగాపాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ చూసి, నరేశ్‌కి ఫోన్  చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పి, నాకు నేనుగా ఈ ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్‌లోనే సుబ్బు కథ చె΄్పాలనుకున్నాడంటే, సినిమాలో ఇంకా నిజాయతీగా ప్రయత్నించి ఉంటాడని ఊహించగలను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 

ఈ క్రిస్మస్‌ మనదే’’ అన్నారు. ‘‘నాని మా ఫ్యామిలీ మెంబర్‌. 16 ఏళ్ల నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. నా ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు నాకు కొంత టెన్షన్  ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్  లేదు. ఆల్రెడీ హిట్‌ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. ‘‘మజ్ను’ టైమ్‌ నుంచి నానిగారు నాకు తెలుసు.

ఆయన ఈవెంట్‌కి రావడమే ఓ బ్లాక్‌బస్టర్‌ కొట్టేశామనే ఫీలింగ్‌ కలుగుతోంది. నేను రాసిన దాన్ని నరేశ్‌గారు అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని  పేర్కొన్నారు. దర్శకుడు సుబ్బు మంగాదేవి. ‘‘ఈ క్రిస్మస్‌కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. సినిమా విజయం పట్ల టీమ్‌ అంతా నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు రాజేష్‌ దండా.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)