Breaking News

ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

Published on Sat, 07/27/2024 - 13:45

ఓటీటీలు మనకు బాగా అలవాటు అయిపోయాయి. ఎంతలా అంటే కొన్నాళ్ల ముందు వరకు తెలుగు సినిమాలు మాత్రమే మనోళ్లు చూసేవాళ్లు. ఇ‍ప్పుడు బాగుందని తెలిస్తే భాషతో సంబంధం లేకుండా ఏ మూవీని వదలట్లేదు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మూవీస్ తీసేది ఎవరని అడిగితే చాలామంది చెప్పే పేరు కొరియన్. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్.. ఇలా ఏ జానర్ చిత్రాలు అయినా కొరియన్స్ బాగా తీస్తారనే పేరుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)

అలా ఇప్పుడు పలు ఓటీటీల్లో ది బెస్ట్ అని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న కొన్ని కొరియన్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి. స్టోరీ లైన్ ఏంటనేది దిగువన లిస్టులో చూద్దాం.

ఫర్గాటెన్ (2017) - ఇదో మిస్టరీ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. గతం మరిచిపోయిన ఓ వ్యక్తి.. సొంత తమ్ముడినే కిడ్నాప్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

మెమొరీస్ ఆఫ్ మర్డర్ (2003) - ఇది మర్డర్ మిస్టరీ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇద్దరు డిటెక్టివ్స్... వరస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాళ్లకు తెలిసిన నిజమేంటనేదే మెయిన్ స్టోరీ.

ఐ సా ద డెవిల్ (2010) - ఇదో యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ ఊరిలో సంబంధం లేకుండా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఇంతకీ ఎవరు చేస్తున్నారు? సీక్రెట్ ఏజెంట్ కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

ద గ్యాంగస్టర్ ద కాప్ ద డెవిల్ (2019) - ఇదో యాక్షన్ మూవీ, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ సైకోని.. గ్యాంగస్టర్, పోలీస్ కలిసి ఎలా మట్టుబెట్టారనేదే స్టోరీ.

ట్రెన్ టూ బుసాన్ (2016) -  ఇది హారర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. బుసాన్ అనే ఊరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి, కూతురితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. కానీ అందులోని మనుషులు.. జాంబీలుగా మారి అందరినీ చంపేస్తుంటారు. మరి వీళ్లు బతికి బయటపడ్డారా లేదా అనేదే స్టోరీ.

ద ఔట్ లాస్ (2017) - ఇది క్రైమ్ యాక్షన్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. కొరియన్, చైనీస్ గ్యాంగ్స్ మధ్య గొడవ జరిగితే.. ఓ డిటెక్టివ్ దాన్ని ఎలా డీల్ చేసాడనేదే స్టోరీ.

ద హ్యాండ్ మెయిడెన్ (2016) - ఇది రొమాంటిక్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 1930ల్లో ఓ రాజకుమారి దగ్గర పనిచేయడానికి ఓ అమ్మాయి వెళ్తుంది. కానీ తర్వాతర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అదే స్టోరీ. 18 ప్లస్ సీన్లు ఉంటాయి. ఒంటరిగానే చూడండి!.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)

పారాసైట్ (2019) - ఆస్కార్ గెలుచుకున్న కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ నిరుపేద ఫ్యామిలీ.. మాయమాటలు చెప్పి ఓ ధనవంతుల ఇంట్లో పనికి చేరుతారు. ఆ తర్వాత జరిగే సంఘటనల సమహారమే అసలు కథ.

ద క్లాసిక్ (2003) - ఇది రొమాంటిక్ డ్రామా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఓ కాలేజీ స్టూడెంట్‌కి పాత డైరీ దొరుకుతుంది. అందులో తన తల్లి ట్రాయాంగిల్ లవ్ స్టోరీ గురించి ఉంటుంది. చివరకు ఆ కుర్రాడికి ఏం తెలిసిందనేదే స్టోరీ.

ఓల్డ్ బాయ్ (2003) - ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఏమి లేనీ ఓ ఖైదీకి అన్ని వసతులు సమకూర్చిన.. లేని పోని గొడవల్లో ఇరుక్కుంటాడు. చివరకు ఏమైందనేదే అసలు కథ.

ద అడ్మైరల్ (2014) - ఇది పీరియాడికల్ యాక్షన్ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. కేవలం 13 యుద్ధనౌకలు ఉన్న ఓ యోధుడు.. 300 యుద్ధ నౌకలున్న జపాన్ యోధులతో ఎలా తలపడ్డాడనేదే స్టోరీ.

ఏ ట్యాక్సీ డ్రైవర్ (2017) - ఇది యాక్షన్ కామెడీ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. రియల్ లైఫ్ సంఘటనలతో తీసిన ఈ సినిమా ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్, ఊహించని వివాదాల్లో చిక్కుకుంటే ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)