Breaking News

'ఇదేం మీ ఇల్లు కాదు.. ముందు బయటికి వెళ్లండి'.. ఆలియా భట్‌ ఆగ్రహం

Published on Fri, 08/15/2025 - 08:16

బాలీవుడ్ భామ ఆలియా భట్‌ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఈ ఏడాది ‍అల్ఫా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది వచ్చిన జిగ్రా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శివ్‌ రావేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్‌లకు కాస్తా విరామం దొరకడంతో ఆలియా భట్‌ ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తోంది. ముంబయిలోని తన నివాసం వద్ద పాడిల్‌ బాల్‌ ఆడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే అంతకుముందే పాడిల్ బాల్ ఆడేందుకు వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఆమెను ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు. ఏకంగా ఆలియాతో పాటే బిల్డింగ్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆలియా భట్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపలికి రావొద్దు.. దయచేసి బయటికి వెళ్లండి.. ఇది మీ భవనం కాదు అంటూ మండిపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయినా సెలబ్రిటీలను ఫోటోల కోసం ఇలా వెంటపడి వేధించడం సరికాదని కొందరు నెటిజన్స్ ‍కామెంట్స్ చేస్తున్నారు. వారికి పర్సనల్‌ లైఫ్‌ ఉంటుందని.. ఇలా ఇబ్బంది పెట్టపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా చేసేవారికి కొంతైనా కామన్ సెన్స్ ఉండాలని.. సెలబ్రిటీలను బాధపెట్టడం సరికాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు.

కాగా.. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్‌ క్రియేట్‌ చేయనుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనుంది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)