Breaking News

ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్‌' యాక్షన్‌ మూవీ

Published on Sat, 11/23/2024 - 15:50

ఆలియా భట్‌ భారీ యాక్షన్‌ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన​్‌ సీన్స్‌లో దుమ్మురేపింది. అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.

అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్‌ బాల దర్శకత్వంలో రూపొందిన  జిగ్రా సినిమాను కరణ్‌ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్‌ భట్, సోమెన్‌ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్‌ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌లు అన్నింటిలోనూ విడుదల కానుంది.

జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్‌ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్‌ నటిస్తుంది. అల్ఫా, ల‌వ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)