Breaking News

ఓటీటీలో 'జిగ్రా' స్ట్రీమింగ్‌.. అధికారిక ప్రకటన

Published on Thu, 12/05/2024 - 12:48

ఆలియా భట్‌ భారీ యాక్షన్‌ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన​్‌ సీన్స్‌లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్‌ తమ్ముడి పాత్రలో వేదాంగ్‌ అద్భుతంగా నటించారు.

అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్‌ బాల దర్శకత్వంలో రూపొందిన  జిగ్రా సినిమాను కరణ్‌ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్‌ భట్, సోమెన్‌ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్‌ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌లు అన్నింటిలోనూ విడుదల కానుంది.

జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్‌ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్‌ నటిస్తుంది. అల్ఫా, ల‌వ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)