Breaking News

ఆలియా భట్‌కు రెండోసారి ప్రెగ్నెన్సీ.. అప్పుడేనా?

Published on Sun, 01/22/2023 - 21:21

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరొందిన అలియా భట్‌, రణ్‌బీర్ కపూర్ పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఈ బాలీవుడ్ జంట గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు నటించిన బ్రహ్మస్త్ర-పార్ట్-1 విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దంపతులకు నవంబర్ ఆరో తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆ ముద్దుల కూతురికి రాహా కపూర్‌ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ జంటపై అప్పుడే ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆలియా త్వరలోనే రెండో బిడ్డకు వెల్‌కమ్‌ చెప్పనుందని బీ టౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు మరోసారి గర్భవతి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలియా భట్ తన రెండో బిడ్డను ఆశిస్తున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. అయితే ఆమె ఇటీవల ఓ దుస్తుల కోసం కంపెనీ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అందులో కొత్త మెటర్నిటీ కలెక్షన్స్‌ను లాంఛ్‌ చేసినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు మళ్లీ గర్బం ధరించిందనే విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జంట అధికారికంగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. 

కెరీర్ పరంగా రణబీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో అలియా మరోసారి రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది. ఆమె తొలి హాలీవుడ్ చిత్రం వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌తో కలిసి హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది. కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ మూవీ "జీ లే జరా"లో కూడా నటించనుంది. రణబీర్ రాబోయే ప్రాజెక్ట్‌ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న "యానిమల్" లో నటిస్తున్నారు. రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ నటించిన రోమ్-కామ్ ఈ ఏడాది విడుదల కానుంది. 


 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)