Breaking News

ఓటీటీలో 'అలనాటి రామచంద్రుడు'.. వారిద్దరికీ ఫస్ట్‌ సినిమానే

Published on Fri, 09/27/2024 - 17:03

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అయిన సరికొత్త ప్రేమకథా చిత్రం  ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష హీరోయిన్‌గా నటించారు.  ఈ మూవీతో వీరిద్ద‌రూ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.

‘అలనాటి రామచంద్రుడు’ సినిమా ఆగష్టు 2 విడుదలైంది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు.  సుమారు రెండు నెలల తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా సడెన్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్రంలో బ్ర‌హ్మాజీ, కేశ‌వ్ దీప‌క్‌, వెంక‌టేష్ కాకుమాను కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

కథేంటంటే.. 
సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్‌. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్‌పై స్పీచ్‌ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్‌ట్రావర్ట్‌. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్‌ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. 

అంతలోనే ధరణికి బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్‌) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్‌ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్‌తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు?  ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)