Breaking News

బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్.. అదే ప్రధాన కారణం: అక్షయ్ కుమార్

Published on Wed, 01/22/2025 - 14:44

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ ప్రస్తుతం స్కై ఫోర్స్ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. సందీప్‌ కేవ్లానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని జియో స్టూడియోస్‌, మడాక్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హైజరైన అక్షయ్ బాక్సాఫీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఓటీటీల వల్లే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్‌ అవుతున్నాయని అక్షయ్ కుమార్ అన్నారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల భారీగా తగ్గిందని తెలిపారు. పెద్ద చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద రాణించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీలేనని వెల్లడించారు.

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..'ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి ఆరా తీశా. ఏ సినిమా అయినా ఓటీటీలో చూస్తామని అంటున్నారు. బాక్సాఫీస్‌ వద్ద సినిమాలు సరిగ్గా సక్సెస్‌ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీనే అని నాకు అర్థమైంది. కరోనా టైమ్‌లో ఓటీటీ వేదికగా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. అది ఒక అలవాటుగా మారిందని'‌ అన్నారు. కాగా.. తెలుగులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)