Breaking News

నా కుమార్తె నగ్న చిత్రాలు అడిగారు: అక్షయ్‌ కుమార్‌

Published on Fri, 10/03/2025 - 15:42

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైబర్‌ నేరాల గురించి మాట్లాడుతూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో  పాల్గొన్న అక్షయ్‌ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని గుర్తు చేశారు.  తన 13 ఏళ్ల కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక కలతపెట్టే   సంఘటనను పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్‌ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

సైబర్‌ నేరగాళ్లు తన కుమార్తెతో ఎలా ప్రవర్తించారో ఇలా పంచుకున్నారు. "కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను  మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కుమార్తె ఆన్‌లైన్‌ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో  ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్‌ అంటూనే  మీరు మేల్‌, ఫీమేల్‌నా అంటూ జెండర్‌ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్‌ చేశాడు.  ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసి, వెళ్లి నా భార్యతో చెప్పింది. 

ఇలాంటివి సైబర్‌ నేరంలో ఒక భాగం.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మహారాష్ట్రలో ఏడవ తరగతి నుంచే పిల్లలకు ఈ నేరాల గురించి తెలియాలి. అందుకోసం ప్రతి స్కూల్లో సైబర్ పీరియడ్ అని  ఒక గంట సమయం కేటాయించాలని  ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి నేరాళ గురించి  పిల్లలకు వివరించాలి. నేటి ప్రపంచంలో సైబర్‌ నేరం వీధి నేరాల కంటే ప్రమాదంగా మారుతోందని మీ అందరికీ తెలుసు. ఈ నేరాన్ని ఆపడం చాలా ముఖ్యం..." అని అక్షయ్ వెల్లడించారు. ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు మీరు కూడా  ఆవతల మరో వ్యక్తితో ఆడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తన కుమార్తె ఘటనను అక్షయ్‌ గుర్తుచేశారు.

ముంబైలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మహారాష్ట్ర), రష్మి శుక్లా, ఇక్బాల్ సింగ్ చాహల్ (ఐపీఎస్), రాణి ముఖర్జీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)