Breaking News

26 సార్లు రీమేక్‌ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Published on Sun, 10/06/2024 - 17:47

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్‌ ఖేల్‌ మే'. టీ-సిరీస్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో ఫర్దీన్‌ ఖాన్‌, వాణీ కపూర్‌, ప్రగ్యా జైస్వాల్‌, ఆదిత్య సీల్‌ కీలక పాత్రల్లో నటించారు.

దసరా కానుకగా అక్టోబ‌ర్ 09 నుంచి  'ఖేల్‌ ఖేల్‌ మే' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు  నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.  సుమారు రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద  రూ. 60 కోట్ల వరకు రాబట్టింది.

మూడు జంటల చుట్టూ తిరిగే కథతో, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 26సార్లు రీమేక్‌ అయి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకుంది. 2016లో పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ పేరుతో మొదట ఇటాలియన్‌లో విడుదలైంది. ఈ ఎనిమిదేళ్లలో 26సార్లు ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫ్రెంచ్‌, కొరియన్‌, మాండరిన్‌, రష్యన్‌, ఐస్‌ల్యాండిక్‌, తెలుగులో (రిచి గాడి పెళ్లి), మలయాళం (12th మ్యాన్‌), కన్నడలో (లౌడ్‌ స్పీకర్‌) పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్‌ చేశారు.  హిందీలో 'ఖేల్‌ ఖేల్‌ మే'గా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)