Breaking News

అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్‌ కుమార్‌

Published on Sat, 03/08/2025 - 13:12

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) తనను స్టార్‌ అని పిలిస్తే నచ్చదంటున్నాడు. స్టార్‌లా ఉండటం తనకిష్టం లేదని చెప్తున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అక్షయ్‌ మాట్లాడుతూ.. నాకు స్టార్‌ (నక్షత్రం)గా ఉండాలని లేదు. ఎందుకంటే నక్షత్రాలు ఎప్పుడూ రాత్రివేళలో మాత్రమే ప్రకాశిస్తాయి. నాకు ఉదయం, రోజంతా కూడా ప్రకాశించాలని ఉంది. అందుకే స్టార్‌ను కాదల్చుకోలేదు అన్నాడు.

స్కూల్‌లో క్రమశిక్షణ..
క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మనమందరం స్కూల్‌లో ఎంతో క్రమశిక్షణతో మెదులుకునేవాళ్లం. కానీ పెరిగేకొద్దీ ఆ క్రమశిక్షణను నెమ్మదిగా కోల్పోతున్నాం. నేను త్వరగా పడుకుని అంతే త్వరగా నిద్రలేస్తాను. అది చూసి చాలామంది ఎందుకలా త్వరగా నిద్రపోతావ్‌? అని అడుగుతారు. డిసిప్లిన్‌గా ఉంటే కూడా ప్రశ్నిస్తారా? అన్నాడు.

సినిమా
అక్షయ్‌ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బడే మియా చోటే మియా, సర్ఫిరా, ఖేల్‌ ఖేల్‌ మే, స్త్రీ 2, సింగం అగైన్‌ వంటి చిత్రాల్లో కనిపించాడు. ఈ ఏడాది స్కై ఫోర్స్‌ మూవీతో అలరించాడు. ప్రస్తుతం కేసరి చాప్టర్‌ 2, జాలీ ఎల్‌ఎల్‌బీ 3, హౌస్‌ఫుల్‌ 5, కన్నప్ప(తెలుగు), భూత్‌ బంగ్లా, వెల్‌కమ్‌ టు ద జంగిల్‌, హీరా ఫెరి 3 వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. 

చదవండి: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)